SKLM: పలాస మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి) పనులను పలాస ఎమ్మెల్యే శిరీష ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడకుండా రోడ్డు పైకి నీరు రాకుండా మురుగు కాలువల వ్యవస్థ నిర్మించాలన్నారు. పనులు త్వరితగతిన, నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.