GNTR: గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం నగరంలోని ఆర్టీసీ కాలనీ, రెడ్ల బజార్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. ప్రతి ఇంటి నుండి ప్రతిరోజూ చెత్త సేకరించాలని, మధ్యాహ్నం వేళల్లో గ్యాంగ్ వర్క్ తప్పనిసరిగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.