WGL: పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్‌ను ఇవాళ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు సందర్శించారు. మహిళలకు ఉచితంగా పరీక్షలు, చికిత్సలు అందుతున్న క్లినిక్ కార్యాచరణను సమీక్షించి, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు.