KNR: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో వీణవంక మండల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, చేపట్టినట్లు ఎస్సై ఆవులు తిరుపతి తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. డీజే సౌండ్ సిస్టం, బాణసంచా నిషేధమని వెల్లడించారు. ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని కోరారు.