మనం తీసుకునే ఆహారంలో పెరుగు చాలా ముఖ్యమైనది. దీనిలో ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అలాంటి వారికి పెరుగు చాలా మంచిది. అంతేకాకుండా మలబద్ధకం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు తగ్గుతాయి. కాగా, జలుబు, అలర్జీ ఉన్నవారు రాత్రిపూట పెరుగును తినవద్దు.