PDPL: నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, జరుపుకోవాలని పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, డీజేలు, బహిరంగ మద్యపానం నిషేధమని తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.