MDK: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో నుంచి క్రిస్మస్ వేడుకలకు ఈనెల 24- 29 వరకు 216 బస్సులను పలు రూట్లలో నిర్వహించగా, 1.75 లక్షల కిలోమీటర్లు నడిచినట్లు డిపో మేనేజర్ సురేఖ తెలిపారు. పదిమంది సిబ్బంది 24 గంటలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించారని వివరించారు. ఇదే తరహాలో ప్రతి క్రిస్మస్కు ప్రత్యేక బస్సులను తిప్పుతున్నట్లు సురేఖ తెలిపారు.