KNR: వీణవంక మండల కేంద్రంలో సర్పంచ్ ఫోరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా లస్మక్కపల్లి సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా హిమ్మత్‌నగర్ సర్పంచ్ జడల శ్రీకాంత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి, పంచాయతీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.