WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో మంగళవారం వినియోగదారుల అవగాహన చట్టం సందర్భంగా అవేర్నెస్ టెస్టింగ్ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్డీవో ఉమారాణి పాల్గొని.. విద్యార్థులకు వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం జరిగిన పోటీల్లో నర్సంపేట మైనారిటీ పాఠశాల విద్యార్థిని శ్రీజ మొదటి బహుమతి సాధించారు.