NGKL : వార్షిక తనిఖీల్లో భాగంగా డీఎస్పీ శ్రీనివాస్ అచ్చంపేట మండల పోలీస్ స్టేషన్ రికార్డులను మంగళవారం పరిశీలించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, సంక్రాంతికి చైనా మాంజాపై కఠినంగా ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో మెళకువలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్య క్రమంలో ఎస్సై సద్దాం హుస్సేన్ పాల్గొన్నారు.