MHBD: తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామంలో ఇవాళ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు సర్పంచ్ విస్సంపల్లి కవిత బాలకృష్ణ తెలిపారు. ఈ క్యాంపులో పలు రకాల వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం నిరంతర మెడికల్ క్యాంపుల ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.