NLG: ప్రభుత్వ ఉద్యోగులు పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలని అప్పుడే వారి గుర్తింపు పొందుతారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కేతేపల్లి ఎంపీడీవోగా విధులు నిర్వహించిన బొడ్ల శ్రీనివాస్ రావు పదవి విరమణ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరై శ్రీనివాసరావును సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయన సేవలను కొనియాడారు.