JN: జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ హాజరై ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. క్రీడలు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందిస్తాయని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు.