NGKL: మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ, సవరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ బదవత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆర్డీవోలు, కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాలను పకడ్బందీగా రూపొందించి ప్రచురించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం పాల్గొన్నారు.