SRPT: మేళ్లచెర్వులో జరిగిన సైన్స్ ఫెయిర్‌లో నూతనకల్ మండల పరిధిలోని పెదనేమిలా గ్రామానికి చెందిన విద్యార్థి జి.కేశవర్ధన్ రూపొందించిన ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గైడ్ టీచర్ కె.హరి కృష్ణ పర్యవేక్షణలో కేశవర్ధన్ ప్రదర్శించిన “ఆటోమేటిక్ ఓపెన్ అండ్ క్లోజ్ మ్యాన్‌హోల్స్” నమూనాను అధికారులు, సందర్శకులు ఆసక్తిగా తిలకించారు.