PPM: గిరిజన ప్రాంతాల్లో త్రాగునీరు పారిశుధ్య ప్రమాణాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఐటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.