NZB: డిచ్పల్లి మండలంలోని ఓ గ్రామంలో ఇవాళ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. బాలిక రాసిన సూసైడ్ నోట్లో తనతో పదో తరగతి నుంచి ఇంటర్ వరకు కలిసి చదువుకున్న ఓ యువకుడి తల్లిదండ్రులు తనను మానసికంగా వేధిస్తురని తెలిపింది.