AKP: గొలుగొండ మండలం కొత్త మల్లంపేటలో మంగళవారం లేగ దూడల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ నోడల్ అధికారిణి డాక్టర్ సౌజన్య ప్రదర్శనలు ప్రారంభించారు. వేములపూడి పశువైద్యులు డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ నరేష్ మాట్లాడుతూ.. ఆడ పెయ్యిలు పుట్టించే సెమెన్ పై అవగాహన కల్పించారు. అధిక పాల దిగుబడి కోసం మేలు జాతి పశువులను ఎంపిక చేసుకోవాలన్నారు.