WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని భద్రకాళి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మంగళవారం AIFDS ఆధ్వర్యంలో డ్రగ్స్ మత్తు, మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై శర్వాణి మాట్లాడుతూ.. విద్యార్థులు డ్రగ్స్, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.