KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి దృష్టిహీన ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను మంగళవారం ఆవిష్కరించారు. దృష్టిహీనులు స్వయం ఆధారంగా కృషి చేసి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన ప్రశంసించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.