WGL: వర్ధన్నపేట పట్టణంలోకల్లు గీత కార్మిక సంఘం నూతన మండల కమిటీ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా జనుగాం యాకయ్య గౌడ్, మండల ప్రధాన కార్యదర్శిగా సట్ల సూరయ్య గౌడ్‌తో పాటు ఇతర పదవులకు సభ్యులను ఎన్నుకున్నారు. గౌడకుల అభివృద్ధి, కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తామని ఎన్నికైన సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ్ కులస్తులు పాల్గొన్నారు.