MLG: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతి, భద్రతలకు ప్రజలు సహకరించాలని SP శబరీష్ కోరారు. ఇవాళ SP శబరీష్ మీడియాతో మాట్లాడారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 31న డీజేలకు అనుమతి లేదని, పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని SP స్పష్టం చేశారు.