కర్నూలు జిల్లాలో రబీకి అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జేడీఏ పీఎల్ వరలక్ష్మి తెలిపారు. జిల్లాకు 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే ప్రణాళిక కంటే ఎక్కువ సరఫరా జరిగిందన్నారు. ప్రస్తుతం గోదాములు రైతు సేవా కేంద్రాల్లో 5,849 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు.