శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని రేషన్ కార్డుదారులకు జనవరి 2వ తేదీ నుండి చౌక ధరల దుకాణాల ద్వారా ఒక్కో కార్డుకు ఒక కిలో రూ.20కే గోధుమ పిండిని పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ అవకాశాన్ని రేషన్ కార్డుదారులు వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు.