NZB: అంతర్జాతీయ స్విమ్మింగ్లో సత్తాచాటి ఇందూరు పేరు నిలబెట్టాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. సీపీ కార్యాలయంలో రాష్ట్రస్థాయి స్విమ్మింగ్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను ఆయన మంగళవారం అభినందించారు.మోపాల్ పోలీస్స్టేషన్లో పోలీస్కానిస్టేబుల్గా పనిచేస్తున్న హరికృష్ణ పిల్లలు మోహన్, వినమ్రలు రాష్ట్రస్థాయి స్విమ్మింగ్లో ప్రతిభ చూపారు.