GDWL: అయిజ మండలం కిష్టాపురానికి చెందిన విజయలక్ష్మి జిల్లాస్థాయి గణిత టాలెంట్ టెస్టులో ప్రథమ స్థానాన్ని సాధించింది. వడ్డేపల్లి మండలం తనగల జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతున్న ఆమె ప్రతిభ చాటింది. మంగళవారం గద్వాలలో పోటీల్లో ఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకుంది.