WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం HM వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో తిథి భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ సుభాషిని విద్యార్థులకు అరటిపండ్లు పంపిణీ చేశారు. అనంతరం HM మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పోషక విలువలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.