BPT: చుండూరు మండలం చిన్నపరిమి గ్రామానికి చెందిన కూటమి పార్టీ యువకులు మంగళవారం వైసీపీలో చేరారు. వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ అబద్ధపు హామీలతో మోసపోయామని గ్రహించిన యువత విసుగు చెంది వైసీపీలోకి వస్తున్నారని అశోక్ బాబు ఈ సందర్భంగా విమర్శించారు.