BHNG: ఆలేరులోని ఎరువుల దుకాణాలను మంగళవారం మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ రిజిష్టర్లును పరిశీలించారు. ఎరువుల దుకాణాలలో ప్రతీ రోజు యూరియా అమ్మకాలు ఈ పాస్ మిషన్ ద్వారానే జరగాలని, యాసంగి సీజన్‌కు సరిపడా యూరియా, ఇతర ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని యూరియా సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని తెలియజేశారు.