CBSE పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మార్చి 3వ తేదీన జరగాల్సిన టెన్త్ పరీక్షను మార్చి 11కి; 12వ తరగతి విద్యార్థులకు జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 10కి మార్చింది. మిగతా పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. కాగా, ఫిబ్రవరి 17 నుంచి సీబీఎస్ఈ పది, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.