MDK: సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా ఈ యాసంగి సీజన్లో సాగు నీరు అందకపోవచ్చని హవేలిఘనపూర్ మండలం తొగిటలో మండల వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి రైతులను సూచించారు. నీటి పారుదల శాఖ సూచనల ప్రకారం ఘనపూర్ ఆయకట్టు కింద ఎంఎన్ కెనాల్ ద్వారా పంటలు సాగు చేసే రైతులు ఈ విషయాన్ని గమనించాలి. ఈ యాసంగి సీజన్లో పంటలు వేయరాదు అని వెల్లడించారు.