SRPT: నడిగూడెం మండల వ్యాప్తంగా రైతులకు మన గ్రోమోర్ ద్వారా మరిన్ని సేవలు అందించటం సంతోష దాయకమని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ వేపూరి తిరుపతిమ్మ సుదీర్ అన్నారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలో మన గ్రోమోర్ ఎరువుల దుకాణంను నడిగూడెం గ్రామ సర్పంచ్ దున్నా శ్రీనివాస్‌తో కలసి ప్రారంభించి మాట్లాడారు.