SRPT: మాలలపై దాడి హేయమైన చర్య అని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. మునగాల మండలం నారాయణగూడెంలో వీరబాబు,దళిత మహిళలపై రెడ్లు తీవ్రంగా దాడి చేశారని మహిళలను చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపారు.