MBNR: మిడ్జిల్ మండలంలోని భైరంపల్లి, చిల్వేర్, మున్ననూర్ గ్రామాల్లో మంగళవారం గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. పశువైద్యాధికారి శివరాజ్ ఆధ్వర్యంలో సుమారు 30,175 జీవాలకు మందులు వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆయా గ్రామాల సర్పంచులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.