KRNL: వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. ఈ ప్రణాళికలో భాగంగా మంగళవారం బి-క్యాంప్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల మెంటార్‌గా ఉన్న జాయింట్ కలెక్టర్ విద్యార్థులతో నేరుగా సంభాషించి, విద్యా బోధన విధానం, పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్న తీరును పరిశీలించారు.