NLG: నార్కెట్పల్లి మండలం షాపల్లి గ్రామంలో కమలాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహోత్సవాలు జనవరి మూడు నుంచి వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిసి, బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని కోరుతూ.. మంగళవారం ఆహ్వాన పత్రికను అందించారు. వారి వెంట గ్రామానికి చెందిన నాయకులు ఉన్నారు.