అనంతపురం జిల్లాలో రబీ సీజన్ కోసం 27,232 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ప్రస్తుతం 4,950 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని స్పష్టం చేశారు. రైతులు ఎరువులు కొనేటప్పుడు బస్తాపై ఉన్న ధరకే చెల్లించి, తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచించారు.