ATP: కళ్యాణదుర్గం పోలీసులు మంగళవారం ఇద్దరు అంతరాష్ట్ర ద్విచక్ర వాహన దొంగలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 22.80 లక్షల విలువైన 32 బైకులను స్వాధీనం చేసుకున్నారు. డూప్లికేట్ తాళాలతో వాహనాలు ఎత్తుకెళ్లడంలో వీరు ఆరితేరారని పోలీసులు తెలిపారు. అనంతపురం, కర్నాటకలోని పావగడ ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.