VZM: మెరకముడిదాం మండలం పెదపూతకవలసలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంగళవారం ఎమ్మెల్యే కళా వెంకటరావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. అలాగే అభివృద్దికి పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు.