గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా నిర్వహించారు. ఈ నిఘాలో పోలీసులు ప్రధాన నిందితుడు వాసిమళ్ళ వంశీకృష్ణ (25)ను అరెస్ట్ చేసి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో 14 కేసులు నమోదయ్యాయి. గంజాయి విక్రయం, రవాణా, నిల్వపై కఠిన చర్యలు తప్పవని వెస్ట్ డీఎస్పీ హెచ్చరించారు.