MDK: డిసెంబర్ 31న ఫంక్షన్ హాల్స్, రిసార్ట్లో న్యూఇయర్ వేడుకలు జరుపుకునే వారు ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని రామాయంపేట ఎక్సైజ్ సీఐ నరేందర్ సూచించారు. న్యూ ఇయర్ వేడుకల్లో పరిమితికి మించి మద్యం కలిగి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం తాగి ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.