నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది క్రైమ్ రేట్ 4 శాతం తగ్గిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వార్షిక క్రైమ్ నివేదికను వివరించారు. మహిళలపై అఘాయిత్యాలు, పోక్సో కేసులు స్వల్పంగా పెరిగాయన్నారు. జిల్లాలో గ్యాంగ్ వార్ లేకుండా చేశామన్నారు. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరించామన్నారు.