NZB: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని NZB జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఆయన భీమ్గగల్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.