BHPL: రేగొండ మండలం కొడవంటచ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో రేపు ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. కొబ్బరికాయలు, పూజ సామగ్రి అమ్మకం, కొబ్బరి ముక్కలు పోగు హక్కు, మనిహారం అమ్మకం హక్కు మొదలైనవీ షాపులకు టెండర్లు వేయనున్నారు. ఆసక్తి ఉన్నవారు డిపాజిట్ చెల్లించి పాల్గొనవచ్చని ఆలయ నిర్వాహకులు తెలిపారు.