సత్యసాయి: ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రేపు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2,62,533 మందికి రూ. 115.51 కోట్లు మంజూరు చేశామని, 4472 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటారని తెలిపారు. పింఛన్ల పంపిణీలో ఎటువంటి ఫిర్యాదులు రాకుండా వందశాతం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.