TG: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వేదికలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సాధారణ నేలమీదనే కార్యకలాపాలు కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు సబ్ రిజిస్ట్రార్లు కూర్చునే వేదికలన్నీ ఆర్భాటంగా కనిపించేవి. ఎత్తయిన వేదికలు ఉండేవి. అయితే ప్రభుత్వ ఆదేశాలతో చాలా కార్యాలయాల్లో వేదికలను సిబ్బంది తొలగించగా.. మరికొన్నింటిని తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు.