PLD: నకరికల్లు మండలంలోని త్రిపురాపురం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వచ్చిన టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావమైన బాధితుడిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.