MBNR: జిల్లాలో ప్రసిద్ధి చెందిన కురుమూర్తి స్వామి క్షేత్రంలో బుధవారం గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వెలుగొందుతున్న స్వామివారి గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.