WGL: చెన్నరావుపేట మండల కేంద్రంలోని కోపాకుల చెరువు కింది పొలాలకు నీరు అందించే సాగు కాల్వ మరమ్మతు పనులను ఇవాళ సర్పంచ్ కంది శ్వేత -కృష్ణచైతన్య రెడ్డి ప్రారంభించారు. ఉపాధి హామీ నిధులతో రైతులకు లాభం చేకూర్చేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కాల్వలో పేరుకుపోయిన మట్టి, గుర్రపుడెక్క తొలగించి నీరు సజావుగా పారేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.