WNP: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం తప్పక ఉండాలని, లేని పాఠశాలలో నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ప్రక్రియను మార్చి 31వ తేదీ లోపు పూర్తయ్యే విధంగా చూడాలన్నారు.